కృష్ణా: మద్యంతో పట్టుబడ్డ ప్రభుత్వాధికారి
ABN , First Publish Date - 2020-06-01T13:49:59+05:30 IST
కృష్ణా: మద్యంతో పట్టుబడ్డ ప్రభుత్వాధికారి
కృష్ణా: జిల్లాలోని దొనబండ చెక్‌పోస్ట్ వద్ద ఇబ్రహీంపట్నం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మంగళగిరి ఎన్డీఆర్‌ఎఫ్ పదవ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం బాటిళ్లతో పట్టుబట్టారు. వారి వద్ద నుంచి 29 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తీసుకువెళ్తున్న వీరులపాడు మండల అభివృద్ధి అధికారితో పాటు మరో ఇద్దరిని ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ అధికారి ప్రస్తుతం కంచికచర్ల ఇంచార్జి మండల అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆయన వద్ద నుండి 27 బీర్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే దొనబండ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు జరిపిన తనిఖీలో మరో ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. వీరు మంగళగిరి ఎన్డీఆర్‌ఎఫ్ పదవ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 29 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.