పోలీసులు-గ్రామస్తుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-05-10T12:57:31+05:30 IST

జిల్లాలోని కృత్తివెన్ను మండలం వాలంకలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్న 9 మందిని అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు.

పోలీసులు-గ్రామస్తుల మధ్య ఘర్షణ

కృష్ణా: జిల్లాలోని కృత్తివెన్ను మండలం వాలంకలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్న 9 మందిని అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీసులను  గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల లాఠీఛార్జ్ లో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-05-10T12:57:31+05:30 IST