కృష్ణా జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-09-14T16:54:44+05:30 IST

జిల్లాలోని ఉంగుటూరు మండలం ఆత్కూరు పశువుల ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

కృష్ణా జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలం ఆత్కూరు పశువుల ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు గత పదేళ్లుగా గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆత్కూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆత్కూరు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-14T16:54:44+05:30 IST