కృష్ణా: కంకిపాడులో భారీ చోరీ
ABN , First Publish Date - 2020-08-12T12:45:16+05:30 IST
జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో భారీ చోరీ జరిగింది.

కృష్ణా: జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో భారీ చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని ఓ ఇంట్లో దుండగులు పెద్ద ఎత్తున చోరీకి తెగబడ్డారు. ఎండి చేపల వ్యాపారి మంగపాటి లక్ష్మీ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ట్రంక్ పెట్టలో దాచిన రూ.3 లక్షల నగదను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.