కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నేడే

ABN , First Publish Date - 2020-12-28T07:48:54+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌పై చేపట్టనున్న డ్రై రన్‌కు కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నేడే

విజయవాడ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సినేషన్‌పై చేపట్టనున్న డ్రై రన్‌కు కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. టీకా సమయంలో ఎదుర య్యే సమస్యలను తెలుసుకుని ముందుగానే వాటిని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో 28, 29 తేదీల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో ఏపీ నుంచి కృష్ణా జిల్లాను ఎంపిక చేశారు. వెబ్‌ బేస్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా నిర్వహించనున్న ఈ ప్రక్రియలో నిజమైన టీకా వేయడం మినహా మిగిలిన కార్యక్రమం యథాతథంగా నిర్వహించనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి, ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విజయవాడ ప్రకాశ్‌నగర్‌లోని అర్బన్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌, పూర్ణ హార్ట్‌ కేర్‌ ఇనిస్టిట్యూట్‌ (ప్రైవేటు ఆస్పత్రి), తాడిగడపలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో డ్రై రన్‌కు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆస్పత్రిలో శిక్షణ పొందిన ఐదుగురు వ్యాక్సినేషన్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. డ్రై రన్‌ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదివారం పరిశీలించారు.

Updated Date - 2020-12-28T07:48:54+05:30 IST