వాళ్ళను కుక్కలలాగా పోల్చడం దుర్మార్గపు చర్య: టీడీపీ నేత
ABN , First Publish Date - 2020-08-06T22:14:26+05:30 IST
అయోధ్యలో ప్రధాని రామాలయానికి శంకుస్థాపన చేశారని టీడీపీ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర అన్నారు.
గుంటూరు: అయోధ్యలో ప్రధాని రామాలయానికి శంకుస్థాపన చేశారని టీడీపీ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. అయోధ్య మాదిరిగానే అమరావతికు పవిత్రమైన మట్టి, నీరు తీసుకొచ్చి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. అయోధ్య లాగే అమరావతి రాజధాని నిర్మాణం జరగాలని కొరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్టు రాజధాని మార్చడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు పెట్టిన రిఫరెండంపై స్పందించే దైర్యం జగన్‌కు లేదన్నారు. మహిళలు మోకాళ్ళ పై నిలబడి వేడుకుంటుంటే వాళ్ళను కుక్కలలాగా పోల్చడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఇసుక కొరతతో పనులు లేక కూలీలు శానిటైజర్‌లు తాగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.