కౌలురైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-04-25T09:49:35+05:30 IST
కౌలురైతు ఆత్మహత్య

బొమ్మనహాళ్, ఏప్రిల్ 24: అప్పులబాధ భరించలేక అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన కౌలు రైతు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన తిప్పేస్వామి (42) కొన్నేళ్లుగా హగరిలోని పొరంబోకు భూమిని సాగుచేసుకుంటున్నాడు. దీంతోపాటు గ్రామ సమీపంలోని 12 ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు పండక రూ.5 లక్షలకు పెరిగిన అప్పును తీర్చే మార్గం కనిపించక పురుగుల మందు తాగాడు.