రోజుకో మాట మాట్లాడుతున్న బాలినేనిని విచారించాలి: కోటంరెడ్డి
ABN , First Publish Date - 2020-07-26T00:10:30+05:30 IST
రోజుకో మాట మాట్లాడుతున్న బాలినేనిని విచారించాలి: కోటంరెడ్డి
నెల్లూరు: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డిపై టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శలు గుప్పించారు. నల్లమల్లి బాలు బాలినేని ముఖ్య అనుచరుడే అని కోటంరెడ్డి ఆరోపించారు. చెన్నైలో దొరికిన డబ్బంతా బాలినేని అక్రమాల ద్వారా సంపాదించినదే అని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. వైఎస్ భారతి బంధువు సుధాకర్‌రెడ్డికి చేరుస్తుండగా దొరికిపోయాయని కోటంరెడ్డి అన్నారు. రోజుకో మాట మాట్లాడుతున్న బాలినేనిని విచారించాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. బాలినేని శ్రీనివాసులురెడ్డి రాజీనామా చేయాలని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు.