సీఎం జగన్‌పై కోట సైలెంట్ సెటైర్
ABN , First Publish Date - 2020-07-10T21:30:28+05:30 IST
సీఎం జగన్ పని తీరుపై విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా

ఇంటర్నెట్ డెస్క్: సీఎం జగన్ పని తీరుపై విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ గురించి తాను పెద్దగా మాట్లాడనని, అయితే ఆంధ్రా గురించి మాట్లాడే అర్హత తనకు ఉందన్నారు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయాన్ని, అలాగే తన సొంతూరులో తనకున్న ఆస్తిని గురించి గుర్తు చేశారు. ఈ హక్కుతో ఏపీ గురించి మాట్లాడుతున్నానంటూ.. ‘‘నిద్ర పోయేవాణ్ని లేపొచ్చు. కానీ నిద్ర నటించేవాణ్ని ఏం చేస్తాం’’ అంటూ తనదైన శైలిలో జగన్ ప్రభుత్వం పనితీరుపై సెటైర్ వేశారు. ఆయనకు ఇవన్నీ తెలియక జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. దానికంటే ఎక్కువ ఏం చెప్పలేనన్నారు.