కొల్లు రవీంద్ర రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు
ABN , First Publish Date - 2020-07-18T19:47:17+05:30 IST
అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించారు.

అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించారు. మోకా భాస్కర్ రావు హత్యకేసులో నిందితుడిగా కొల్లు రవీంద్ర ఉన్న విషయం తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ఎదుట రవీంద్రను హాజరుపరిచారు. ఇప్పటికే రవీంద్ర లాయర్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 20న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌ను విచారించనున్నారు.