‘వాలంటీర్లు...భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దు’

ABN , First Publish Date - 2020-03-09T03:18:57+05:30 IST

‘వాలంటీర్లు...భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దు’

‘వాలంటీర్లు...భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దు’

అమరావతి: టీడీపీ అభ్యర్థులపై కేసులు పెట్టి పోటీలో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. వాలంటీర్లను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదని అధికారులు గ్రహించాలన్నారు. వాలంటీర్లు వైసీపీ మాటలు విని భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని సూచించారు. వైసీపీ కుట్రలను తిప్పికొడతాం, ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. 

Updated Date - 2020-03-09T03:18:57+05:30 IST