నేడు కోడెల ప్రథమ వర్ధంతి

ABN , First Publish Date - 2020-09-16T13:36:00+05:30 IST

నేడు ఏపీ అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో

నేడు కోడెల ప్రథమ వర్ధంతి

గుంటూరు: నేడు ఏపీ అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో టీడీపీ నేతలు వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో కోడెల తనయుడు కోడెల శివరాం, పలువురు టీడీపీ నేతలు పాల్గొననున్నారు. 


మరోవైపు కొవిడ్ కారణంగా కోడెల వర్ధంతి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దంటూ పోలీసులు ఆయన కుమారుడికి నోటీసులు జారీ చేశారు. కోడెల మొదటి వర్ధంతి కోసం ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈక్రమంలో పోలీసులు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమవుతోంది. 

Updated Date - 2020-09-16T13:36:00+05:30 IST