ప్రధానిపై కొడాలి వ్యాఖ్యలు సరికాదు

ABN , First Publish Date - 2020-09-25T08:46:32+05:30 IST

ప్రధాని మోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర

ప్రధానిపై కొడాలి వ్యాఖ్యలు సరికాదు

పార్టీ నేతలు సంయమనం పాటించాలి: సజ్జల


అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో సజ్జల మాట్లాడుతూ ‘మోదీ దేశానికి ప్రధాని.. ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు’ అంటూ తప్పుబట్టారు.


కొడాలి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ప్రధానిపై ఏం వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని, ప్రధాని గురించి పార్టీలో ఎవరైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని సజ్జల స్పష్టం చేశారు. పార్టీ నేతలు సంయమనం పాటించాలని సూచించారు.


Updated Date - 2020-09-25T08:46:32+05:30 IST