-
-
Home » Andhra Pradesh » Kodali Nani comments on Chandrababu
-
చంద్రబాబు జీతాలతో ప్రెస్‌మీట్‌కొచ్చి మాట్లాడే వెధవలున్నారు: కొడాలి నాని
ABN , First Publish Date - 2020-11-21T19:38:22+05:30 IST
విజయవాడ: జగన్ పాదయాత్రలో తీర ప్రాంత ప్రజల కష్టాలు చూశారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

విజయవాడ: జగన్ పాదయాత్రలో తీర ప్రాంత ప్రజల కష్టాలు చూశారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గాలి కబుర్లు చెప్పి గాలికే వదిలేసిన ప్రభుత్వాలను చూశామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఖాళీగా కూర్చొని 500 మంది రాష్ట్ర కార్యదర్శులు.. వెయ్యి మంది ఉపాధ్యక్షులను నియమించారని.. వారంతా పార్టీ ఆఫీస్‌లో బ్రోకర్ పనులు చేసుకుంటూ.. పేపర్లు మోసుకుంటూ తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు జీతాలతో ప్రెస్‌మీట్ కొచ్చి మాట్లాడే వెధవలు ఉన్నారన్నారు. అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని పేర్కొన్నారు.