చంద్రబాబు బినామీలకు ముందే తెలుసు: కొడాలి నాని

ABN , First Publish Date - 2020-09-16T21:13:22+05:30 IST

విజయవాడ: అమరావతిలో రాజధాని వస్తుందని అక్కడ భూములు కోనుగోలు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు..

చంద్రబాబు బినామీలకు ముందే తెలుసు: కొడాలి నాని

విజయవాడ: అమరావతిలో రాజధాని వస్తుందని అక్కడ భూములు కోనుగోలు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బినామీలకు ముందే చెప్పారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. రాజధానిలో రైతులను మోసం చేసి టీడీపీ నాయకులు ఎకరం భూమి 25లక్షలకు కొనుగోలు చేసి కోట్లాది రూపాయలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని లాభం పొందారన్నారు. అమరావతి రాజధాని వ్యవహారంలో చంద్రబాబు అండ్ కో బాగుపడ్డారని కొడాలి నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో పతిపక్షంలో ఉన్నప్పటి నుంచి రాజధాని వ్యవహారంలో కుంభకోణం జరిగిందని చెబుతున్నారన్నారు. 


జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి రాజధాని వ్యవహారంలో కేబినెట్ సబ్ కమిటి అలాగే సిట్ విచారణకు ఆదేశించిందన్నారు. గత మార్చిలోనే అమరావతి భూ కుంభకోణం మీద సీబీఐ విచారణకు అదేశించాలని కేబినెట్ అమోదంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరాటం జరిగిందని కొడాలి నాని పేర్కొన్నారు. రాజధాని భూముల వ్యవహారంలో ఎంతటి వ్యక్తులనైనా వదిలే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని.. అలాగే సంబంధం లేని వాళ్లను ఇరికించి రాజకీయం చేసే వ్యక్తి కూడా కాదన్నారు. చంద్రబాబు నాయుడు జీవితం అంతా ప్రజలకు తెలుసని కొడాలి నాని పేర్కొన్నారు. ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడో ఎంత అస్తి సంపాదించాడో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు నాయుడు కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు గాని ఆ దేవుడు వేసే‌ శిక్ష తప్పించుకోలేరన్నారు. 

Updated Date - 2020-09-16T21:13:22+05:30 IST