సిగ్గు లేకుండా చంద్రబాబు జూమ్ యాప్‌లో పిచ్చివాగుడు..: కొడాలి నాని

ABN , First Publish Date - 2020-08-01T18:17:51+05:30 IST

విజయవాడ: రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ అమోదం తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని అగ్రహం వ్యక్తం చేశారు.

సిగ్గు లేకుండా చంద్రబాబు జూమ్ యాప్‌లో పిచ్చివాగుడు..: కొడాలి నాని

విజయవాడ: రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ అమోదం తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని అగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకి దమ్ము దైర్యం ఉంటే ఆయనకున్న 20 మంది శాసన సభ్యులతో రాజీనామా చేసి అమరావతిలో రాజధానిని కొనసాగించాలని కోరుతూ ఉప ఎన్నికలకి వెళ్లాలన్నారు. ఆ ఉప ఎన్నికలలో 20కి 20 సీట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉంటుందన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికలలో ఓడిపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా రావాలని కొడాలి నాని పేర్కొన్నారు. 


ఇంకా కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు నీ శాసన సభ్యులు వెంటనే రాజీనామా చెయ్యాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తీసుకున్న పిచ్చి తుగ్గలక్ నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు చిత్తు, చిత్తుగా ఓడించినా సిగ్గు లేకుండా జూమ్ యాప్‌లో పిచ్చివాగుడు వాగుతున్నాడు. రాయలసీమ జిల్లాలో 52 సీట్లు ఉంటే బావ, బామ్మర్ది చంద్రబాబు నాయుడు, బాలయ్యను మాత్రమే గెలిపించారు. 


అక్కడ కూడా ప్రజలు చీదరించుకున్న బుద్ది రాలేదు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర ప్రాంతం.. అక్కడ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మిన ప్రజలు చంద్రబాబు నాయుడుకి బుద్ది చెప్పారు. చంద్రబాబు నాయుడు కన్న కలలను తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిరవేర్చాలని అని అనటం ఆయన మూర్ఖత్వం.. మంత్రి కొడాలి నానిఇప్పుడు ఉన్న రాష్ట్ర అర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఒకే చోట లక్ష కోట్లు పెట్టి మహానగరం కట్టటం సాధ్యం కాదు’’ అని పేర్కొన్నారు.  Updated Date - 2020-08-01T18:17:51+05:30 IST