డ్రీమ్డ్ వర్సిటీ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-05-19T01:23:46+05:30 IST

డ్రీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా నిర్వమించిన...

డ్రీమ్డ్ వర్సిటీ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

అమరావతి: డ్రీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా నిర్వమించిన ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎల్‌ఎస్ఎస్‌రెడ్డి, కేఎల్‌ఈఈఈ కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ, అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ జే శ్రీనివాసరావు విడుదల చేశారు. ఆన్ లైన్ ప్రవేశ పరీక్షకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని డాక్టర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి తెలిపారు. టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ చెప్పారు. విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా ఆన్ లైన్ ద్వారానే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. మెరిట్ విద్యార్థులకు 10 శాతం నుంచి 100 శాతం వరకూ మెరిట్ స్కాలర్ షిప్స్ ఇచ్చి ఫీజులో మినహాయింపు ఇస్తామని చెప్పారు. 

Updated Date - 2020-05-19T01:23:46+05:30 IST