ఏలూరు ఘటనపై స్పందించిన కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-07T23:00:14+05:30 IST

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. మిగిలిన వారందరికి ..

ఏలూరు ఘటనపై స్పందించిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్/అమరావతి: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. మిగిలిన వారందరికి చికిత్స కొనసాగుతోంది. అసలు ఈ వ్యాధి ప్రబలడానికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై వ్యాధి సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తోంది. ఇక  ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కేంద్రవైద్య బృందం ఏలూరుకు వెళ్తున్నట్లు తెలిపారు. ముగ్గురు అధికారులతో కూడిన బృందం అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-07T23:00:14+05:30 IST