కిరణ్‌ది ప్రభుత్వ హత్య: హర్షకుమార్‌

ABN , First Publish Date - 2020-07-27T08:27:23+05:30 IST

చీరాలలో దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ది ప్రభుత్వ హత్య అని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ధ్వజమెత్తారు.

కిరణ్‌ది ప్రభుత్వ హత్య: హర్షకుమార్‌

ఒంగోలులో రౌండ్‌ టేబుల్‌ సమావేశం


చీరాల, జూలై 26: చీరాలలో దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ది ప్రభుత్వ హత్య అని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ. కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన కిరణ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిరణ్‌ కుటుంబానికి అన్ని ప్రజా, దళిత సంఘాలు, పార్టీలు అండగా నిలవాలని కోరారు. కాగా, ఇక్కడ కిర ణ్‌కుమార్‌ మృతి, సీతానగరం స్టేషన్లో శిరోముండనం, మరోచోట సామూహిక అత్యాచారం.. ఈ మూడు ఘటనలపై అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని హర్షకుమార్‌ తెలిపారు. అనంతరం రాష్ట్రంలో దళితులపై దాడులకు నిరసనగా ఒంగోలులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. 

Updated Date - 2020-07-27T08:27:23+05:30 IST