ప్రేమించాడని చంపేశారు

ABN , First Publish Date - 2020-05-09T10:02:42+05:30 IST

కూతురు ప్రేమ వ్యవహారం ఆ తండ్రికి, అన్నకు నచ్చలేదు. అయినా ఆమె అతన్నే ఇష్టపడుతుండడంతో గొడవపడ్డారు.

ప్రేమించాడని చంపేశారు

చీరాలలో యువకుడి దారుణహత్యచీరాలటౌన్‌, మే 8: కూతురు ప్రేమ వ్యవహారం ఆ తండ్రికి, అన్నకు నచ్చలేదు. అయినా ఆమె అతన్నే ఇష్టపడుతుండడంతో గొడవపడ్డారు. ఎలాగో తమదారికి తెచ్చుకున్నారు. చివరికి ఆమెనే పావుగా ఉపయోగించి ప్రియుణ్ణి అంతం చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో శుక్రవారం జరిగిన సంఘటన వివరాలు... చీరాలకు చెందిన నల్లగొండ్ల దినేష్‌(21) గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహా రం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆమె ఇంటిలో గొడవలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఆమెను ఒప్పించిన కుటుంబసభ్యులు ప్రియుడి హత్యకు పథకం పన్నారు. అందులో భాగంగానే ఆమెతో దినే్‌షకు ఫోన్‌ చేయించి చీరాలలోని 216 జాతీయరహదారిపైకి పిలిపించారు.


ప్రియురాలి అన్న కంపా విజయ్‌.. వంశీ, యేసు అనే ఇద్దరి సహకారం తీసుకున్నాడు. ముగ్గురూ దినేష్‌ వెంటపడి కోడికత్తితో గొంతులో పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దినేష్‌ రోడ్డు పక్కన గల కృపానగర్‌లోకి పరిగెత్తాడు. ఓ ఇంటి సమీపంలోని చెట్టుకింద  కుర్చీలో కూలబడి అలాగే మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వేముల సుధాకర్‌ స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2020-05-09T10:02:42+05:30 IST