అనంతపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాప్ కలకలం

ABN , First Publish Date - 2020-06-21T18:11:02+05:30 IST

ధర్మవరంలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. కిడ్నాపర్లను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాప్ కలకలం

అనంతపురం జిల్లా: ధర్మవరంలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. కిడ్నాపర్లను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కార్తిక్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. అతని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న కార్తిక్ నాలుగు నెలల క్రితం అరవింద్‌నగర్‌కు చెందిన సురేష్‌కు సెల్ ఫోన్ విక్రయించాడు. అయితే డబ్బులు చెల్లింపు విషయంలో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. దీంతో కార్తిక్‌ను సురేష్ తన స్నేహితులతో  కలిసి కిడ్నాప్ చేశాడు. అతని ఇంటికి కిడ్నాపర్లు ఫోన్ చేసి రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సూరి, సురేష్‌లను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

Updated Date - 2020-06-21T18:11:02+05:30 IST