జీఓ నెంబర్ 3పై సీఎం జగన్‌, గవర్నర్‌కు మాజీ మంత్రి కిడారి లేఖ

ABN , First Publish Date - 2020-06-01T18:37:51+05:30 IST

విశాఖ: జీఓ నెంబర్ 3పై సీఎం జగన్‌, గవర్నర్ హరిచందన్‌కు మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ లేఖ రాశారు.

జీఓ నెంబర్ 3పై సీఎం జగన్‌, గవర్నర్‌కు మాజీ మంత్రి కిడారి లేఖ

విశాఖ: జీఓ నెంబర్ 3పై సీఎం జగన్‌, గవర్నర్ హరిచందన్‌కు మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ లేఖ రాశారు. జీవో నెంబర్ 3పై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి గిరిజనులకు అండగా ఉండాలని కోరారు. జీవో నంబర్ 3పై ఇప్పటివరకు ప్రభుత్వం స్పదించక పోవడం దారుణమన్నారు. నవరత్నాల అమలు కోసం గిరిజన సబ్ ప్లాన్ నిధులు వాడుతున్నారని శ్రవణ్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా గిరిజనుల ప్రక్షాన ఉండాలన్నారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు గిరిజనుల పక్షాన నిలవాలని కిడారి శ్రవణ్‌కుమార్‌ కోరారు.


Updated Date - 2020-06-01T18:37:51+05:30 IST