చికిత్స పూర్తయిన తరువాతే వెళ్తాం: స్టైరిన్ బాధితులు

ABN , First Publish Date - 2020-05-13T21:47:51+05:30 IST

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎల్జీ పాలిమర్స్ బాధితులు.. తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. చికిత్స పొందుతున్న పేషెంట్లకు మధ్యాహ్నం దాటినా భోజనం పెట్టడం లేదని

చికిత్స పూర్తయిన తరువాతే వెళ్తాం: స్టైరిన్ బాధితులు

విశాఖపట్నం: కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎల్జీ పాలిమర్స్ బాధితులు.. తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. చికిత్స పొందుతున్న పేషెంట్లకు మధ్యాహ్నం దాటినా భోజనం పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. బయట ఫుడ్ తెచ్చుకుందామంటే.. ఆస్పత్రి సిబ్బంది అనుమతి ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చికిత్స పూర్తి కాకుండానే తమను పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చికిత్స పూర్తి అయిన తర్వాతే వెళతామని బాధితులు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ ఇచ్చినా వెళ్లబోమని అంటున్నారు. తమకు డబ్బులు ముఖ్యం కాదని, ఆరోగ్యం ముఖ్యం అని అన్నారు. పూర్తిగా కోలుకున్న తరువాతే ఆస్పత్రి నుంచి వెళతామన్నారు. అదేవిధంగా తమకు హెల్డ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బాధితులు డిమాండ్ చేశారు.

Read more