-
-
Home » Andhra Pradesh » KGH superintendent arjun visakhapatnam
-
ఎల్జీపాలిమర్స్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం: డాక్టర్ అర్జున్
ABN , First Publish Date - 2020-05-13T17:24:01+05:30 IST
ఎల్జీపాలిమర్స్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం: డాక్టర్ అర్జున్

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో కొంతమందిని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నామని...వేర్వేరు కారణాల వలన నిన్న డిశ్చార్జి కాలేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొంతమంది కడుపునొప్పి, మరికొందరు శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారని...అలాంటి వారిని ఆయా విభాగాల ప్రత్యేక వార్డులకు తరలిస్తామని చెప్పారు. కోలుకున్న వారు ఇంటికి వెళ్లడానికి సిద్ధం అయిపోయారని ఆయన తెలిపారు. బాధితుల డిమాండ్‌ను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేజీహెచ్‌లో మందుల కొరత లేదని... అందరికీ మందులు, మెరుగైన వైద్యం అందిస్తున్నామని సూపరింటెండెంట్ తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారు ఆరోగ్య సమస్యలు వస్తే కేజిహెచ్ వరకు రాకుండానే ..వారికి సమీపంలో ఏర్పాటు చేసిన క్లినిక్స్‌కు వెళ్ళాలన్నారు. గోపాలపట్నం, పెందుర్తి ఏరియా హాస్పిటల్‌లో స్పెషలిస్టులను ఏర్పాటు చేశామని... అక్కడకు కూడా వెళ్ళవచ్చని డాక్టర్ అర్జున్ సూచించారు.