కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు

ABN , First Publish Date - 2020-03-19T16:36:48+05:30 IST

కర్నూలు: కరోనా వైరస్ కారణంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది.

కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు

కర్నూలు: కరోనా వైరస్ కారణంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది. నేటి నుంచి శ్రీశైలంలోని పాతాళగంగలో భక్తుల పుణ్యస్నానాలను నిలిపివేసినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అన్నదాన మందిరంలో సైతం మార్పులు చేపట్టారు.


అన్న ప్రసాద వితరణను.. వడ్డించే పద్ధతిలో కాకుండా ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందజేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాల్నీ నేటి నుంచే అమలు చేయనున్నట్టు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే భక్తులెవరూ శ్రీశైలానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం వచ్చిన భక్తులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే 104కు సమాచారం అందించాలని ఈవో కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-03-19T16:36:48+05:30 IST