జగన్‌కు కేశినేని శ్వేతా హెచ్చరిక

ABN , First Publish Date - 2020-12-15T23:13:35+05:30 IST

రాజధాని కోసం ఏడాదిగా మహిళలు, రైతులు ఉద్యమిస్తున్నారని టీడీపీ నేత కేశినేని శ్వేతా తెలిపారు. రాజధాని కోసం పోరాడుతున్న

జగన్‌కు కేశినేని శ్వేతా హెచ్చరిక

విజయవాడ: రాజధాని కోసం ఏడాదిగా మహిళలు, రైతులు ఉద్యమిస్తున్నారని టీడీపీ నేత కేశినేని శ్వేతా తెలిపారు. రాజధాని కోసం పోరాడుతున్న శిబిరం వైపు నుంచి సీఎం జగన్ సచివాలయానికి వెళ్తున్నారని, అయితే ఆయన ఒక్క రోజు కూడా అమరావతి రైతులతో మాట్లాడలేదని తప్పుబట్టారు. జగన్ మూర్కత్వంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు ప్రజలకు సీఎం గుప్పెడు ఇసుక కూడా ఇవ్వలేదని శ్వేతా దుయ్యబట్టారు. జగన్ వైఫల్యాలకు మారు పేరుగా నిలుస్తున్నారని విమర్శించారు. సీఎం మూడు రాజధానులను ఎలా కడతారని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. రాజధాని కోసం విజయవాడ యువకులు సైన్యంగా ముందుకు వచ్చారని తెలిపారు. ఈ సైన్యం సునామీగా మారితే జగన్‌కు తట్టుకునే శక్తి ఉందా అని హెచ్చరించారు. కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ప్రాణాలను పణంగా పెట్టుకుని బయటకు వచ్చామని శ్వేతా తెలిపారు.

Read more