అప్పుడయినా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కేశినేని

ABN , First Publish Date - 2020-03-15T17:42:20+05:30 IST

రాష్ట్రంలో ఉన్మాద, ఆటవిక, అరాచక పాలన కొనసాగుతోందని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 6 వారాలా పాటు వాయిదా పడ్డాయి. ఈ....

అప్పుడయినా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కేశినేని

విజయవాడ: రాష్ట్రంలో ఉన్మాద, ఆటవిక, అరాచక పాలన కొనసాగుతోందని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 6 వారాలా పాటు వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు బిహార్‌ను మించిపోయాయని చెప్పారు. ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్నారు. 6 వారాల తర్వాత అయినా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. పోలీసులు అధికార పార్టీ ఆదేశాలు కాదు..చట్టానికి లోబడి పనిచేయాలని కేశినేని సూచించారు. 

Updated Date - 2020-03-15T17:42:20+05:30 IST