ఇప్పటికీ కరోనాను లైట్ తీసుకుంటున్నారు: కేశినేని నాని

ABN , First Publish Date - 2020-04-14T18:21:48+05:30 IST

విజయవాడ: రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్‌కి అవగాహన లేదని.. ఇప్పటికీ లైట్ తీసుకుంటున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు.

ఇప్పటికీ కరోనాను లైట్ తీసుకుంటున్నారు: కేశినేని నాని

విజయవాడ: రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్‌కి అవగాహన లేదని.. ఇప్పటికీ లైట్ తీసుకుంటున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కరోనా బారి నుంచి రాష్ట్ర ప్రజలను మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ కాపాడితే.. ఆయనను ఈ ప్రభుత్వం పదవి నుంచి తప్పించిందన్నారు. లాక్ డౌన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా...ఇంతవరకు డాక్టర్లకు వ్యక్తిగత రక్షణ సూట్లు అందించలేకపోతున్నారన్నారు.


లాక్ డౌన్ పొడిగింపును నాని స్వాగతించారు. లాక్ డౌన్ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అయితే ప్రజలు విజయం సాధించారన్నారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వర్తకులను ఆదుకోవడానికి బ్రిటన్ తరహాలో ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్రాలే జీతాలు ఇవ్వాలన్నారు. డిఫ్యూటీ సీఎం నారాయణ స్వామి, ఓ వర్గం ప్రజలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. తక్షణం ఆయన తన పదవికి, శాసన సభ్యత్వానికి రాజనీమా చేయాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-04-14T18:21:48+05:30 IST