కేఈతో టచ్‌లో లేకుండా పోయిన తమ్ముడు!

ABN , First Publish Date - 2020-03-14T02:31:55+05:30 IST

టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ..

కేఈతో టచ్‌లో లేకుండా పోయిన తమ్ముడు!

కర్నూలు : టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ.. ప్రభాకర్ తనతో మాట్లాడలేదని వైసీపీలోకి వెళ్తే అభ్యంతరం లేదన్నారు. డోన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గనకు చైర్మన్‌, 32 వార్డులు దానం చేస్తున్నామని తెలిపారు. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.


నాతో టచ్‌లో లేడు!

అయితే తాజాగా తమ్ముడి రాజీనామా వ్యవహారంపై ఏబీఎన్‌తో కేఈ ప్రత్యేకంగా మాట్లాడారు. కేఈ ప్రభాకర్ నాతో టచ్‌లో లేడు. టీడీపీ నుంచి ఇంకా ఎవరూ బయటకు వెళ్తారో నాకు తెలియదు. కేఈ ప్రభాకర్ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కేఈ ప్రభాకర్ కోట్ల దంపతులతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. టీడీపీలోకి వచ్చారు కాబట్టి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి నాకు మిత్రులు, ఆప్తులు. మాతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే కోట్లకు సపోర్టు చేస్తాంఅని కేఈ వెల్లడించారు.

Updated Date - 2020-03-14T02:31:55+05:30 IST