-
-
Home » Andhra Pradesh » Kasu Maheshreddy
-
29న తుమ్మలచెరువు టోల్‌ప్లాజాను ముట్టడిస్తాం
ABN , First Publish Date - 2020-11-21T08:52:02+05:30 IST
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్‌ప్లాజాను ఈ నెల 29న ముట్టడిస్తామని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహే్‌షరెడ్డి ప్రకటించారు.

వైసీపీ ఎంపీ అయోధ్య సంస్థపై ఎమ్మెల్యే కాసు ధ్వజం
గుంటూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్‌ప్లాజాను ఈ నెల 29న ముట్టడిస్తామని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహే్‌షరెడ్డి ప్రకటించారు. ఈ ప్లాజా రాంకీ సంస్థ నిర్వాహకులు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెందింది కావటం విశేషం. హైదరాబాద్ సహా ప్రధాన నగరాలకు వెళ్లే ఈ రహదారి మరమ్మతులు నిర్వహించటంలో టోల్‌ప్లాజా నిర్వాహకులు (క్యూబ్ లిమిటెడ్) విఫలమయ్యారని మహే్‌షరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి అధ్వానంగా తయారవటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.