కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు..

ABN , First Publish Date - 2020-11-23T11:32:07+05:30 IST

కార్తీక సోమవారం కావడంతో రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో శివాలయాల్లో భక్తులు స్నానమాచరించేందుకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో భక్తులు ఇళ్ల వద్దే స్నానాలు ఆచరించి

కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు..

విజయవాడ: కార్తీక సోమవారం కావడంతో రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో శివాలయాల్లో భక్తులు స్నానమాచరించేందుకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో భక్తులు ఇళ్ల వద్దే స్నానాలు ఆచరించి ఆలయాలకు వస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చన, పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-11-23T11:32:07+05:30 IST