మంత్రాలయం వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యం సీజ్

ABN , First Publish Date - 2020-07-14T22:08:27+05:30 IST

మంత్రాలయం వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యం సీజ్

మంత్రాలయం వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యం సీజ్

మంత్రాలయం, కర్నూలు: కౌతాళం మండలం ఎరిగేరి గ్రామ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యం, 69 బాక్స్ లలో 6624 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు, పరారీలో మరో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. బోలారో, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు డీఎస్పీ వినోద్ కుమార్  వెల్లడించారు. అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైనా శిక్షిస్తామని హెచ్చరించారు. యువత ఈ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. త్వరలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. దాడుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి రివార్డు అందించి ఆదోని డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2020-07-14T22:08:27+05:30 IST