జగన్‌ను కలిసినా వైసీపీ కండువా కప్పుకోని కరణం బలరాం

ABN , First Publish Date - 2020-03-13T00:10:01+05:30 IST

సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో కరణం వెంకటేష్‌ చేరారు. సీఎం జగన్‌ను కలిసినా కరణం బలరాం వైసీపీ కండువా కప్పుకోలేదు.

జగన్‌ను కలిసినా వైసీపీ కండువా కప్పుకోని కరణం బలరాం

అమరావతి: సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో కరణం వెంకటేష్‌ చేరారు. సీఎం జగన్‌ను కలిసినా కరణం బలరాం వైసీపీ కండువా కప్పుకోలేదు. అంతేకాకుండా మీడియా ముందుకు కూడా కరణం బలరాం రాలేదు. జగన్ సంక్షేమ పాలనకు ఆకర్షితులమై వైసీపీలో చేరామని కరణం వెంకటేష్‌ తెలిపారు. చీరాల నియోజకవర్గం అభివృద్దికి పాటుపడతామని, స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషిచేస్తామని కరణం వెంకటేష్ పేర్కొన్నారు. టీడీపీతో దశాబ్దాల అనుబందం ఉందని, టీడీపీపై విమర్శలు చేయటం సరికాదని కరణం వెంకటేష్‌ అన్నారు.

Updated Date - 2020-03-13T00:10:01+05:30 IST