ఎట్టకేలకు కాపు నేస్తం రెండో విడత
ABN , First Publish Date - 2020-11-08T09:12:01+05:30 IST
కాపు నేస్తం పథకం రెండో విడత నిధులను వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. సరిగ్గా నెల రోజుల్లో ఇస్తామని సీఎం జగన్ ప్రకటించినా...
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): కాపు నేస్తం పథకం రెండో విడత నిధులను వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. సరిగ్గా నెల రోజుల్లో ఇస్తామని సీఎం జగన్ ప్రకటించినా... నాలుగున్నర నెలల తర్వాత నిధుల విడుదలకు మోక్షం లభించింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శనివారం విజయవాడలో డీబీటీ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి కాపునేస్తం రెండో విడత నగదు విడుదల చేశారని వారు పేర్కొన్నారు.