సీఎం జపం చేస్తున్న మంత్రులు.. కాలనీకి అల జగన్మోహనపురం పేరు

ABN , First Publish Date - 2020-12-25T22:42:38+05:30 IST

ఏపీలో పథకాలు అంటే చాలు అధికార పార్టీ నేతలు.. ‘జగనన్న’ అనే పేరు తగిలిచ్చేస్తున్నారు. సీఎం పేరు మీదే స్కీములు ఇచ్చేస్తున్నారు. వైసీపీ నాయకులే..

సీఎం జపం చేస్తున్న మంత్రులు.. కాలనీకి అల జగన్మోహనపురం పేరు

రాజమండ్రి: ఏపీలో పథకాలు అంటే చాలు అధికార పార్టీ నేతలు.. ‘జగనన్న’ అనే పేరు తగిలిచ్చేస్తున్నారు. సీఎం పేరు మీదే స్కీములు ఇచ్చేస్తున్నారు. వైసీపీ నాయకులే కాదు.. ఆఖరికి మంత్రులు కూడా ముఖ్యమంత్రి పేరును జపిస్తున్నారు. సీఎం చల్లని చూపు కోసం మంత్రుల ఓవరాక్షన్ విమర్శలకు తావిస్తోంది. 


తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్ల పట్టాల కార్యక్రమానికి మంత్రి కన్న బాబు హంగామాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలా వైకుంఠపురం రేంజ్‌లో నేమం గ్రామంలో 103 ఎకరాల్లో సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లే అవుట్‌కి ఏకంగా ‘అల జగన్మోహనపుర’మని పేరు పెట్టేశారు. ఆ పేరుతోనే కాలనీ పెట్టేసి ఇళ్లకు పట్టాలు రెడీ అయ్యాయి. 

Updated Date - 2020-12-25T22:42:38+05:30 IST