వలస కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన కన్నా

ABN , First Publish Date - 2020-05-17T19:36:57+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

వలస కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన కన్నా

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఈ లేఖలో వలస కార్మికుల విషయాన్ని ప్రస్తావించారు. కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరి సర్లేదని కన్నా తప్పుపట్టారు. కూలీల సమస్య పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడంలో నిర్దయగా వ్యవహరిస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగం పత్తా లేకుండా పోయిందన్నారు. వలస కార్మికులకు న్యాయం చేయాలని.. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వలస కార్మికుల విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలని లేఖలో కన్నా కోరారు.

Updated Date - 2020-05-17T19:36:57+05:30 IST