హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి: కన్నా

ABN , First Publish Date - 2020-05-09T08:42:12+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు.

హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి: కన్నా

మహారాణిపేట (విశాఖపట్నం), మే 8: ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం కేజీహెచ్‌లో పాలిమర్స్‌ ప్రమాద బాధితులను పరామర్శించారు. ఘటనకు కారణం మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా అనే విషయంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.


ఇక్కడి పరిస్థితులను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించారని వివరించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా అభినందనీయమన్నారు. కన్నాతో పాటు ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పీవీఎన్‌ మాధవ్‌ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులు, నిపుణులు, కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

Updated Date - 2020-05-09T08:42:12+05:30 IST