సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ

ABN , First Publish Date - 2020-05-09T18:49:58+05:30 IST

ఎల్జీ పరిశ్రమలో ప్రమాదంపై సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని లేఖలో కోరారు.

సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ

గుంటూరు: ఎల్జీ పరిశ్రమలో ప్రమాదంపై సీఎం జగన్‌కు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని లేఖలో కోరారు. ‘‘గ్యాస్ లీకేజి ప్రమాదంలో మరణించిన వారు, ఆసుపత్రి పాలైన వారంతా పేదలే. లీకేజికి కారణం మానవ తప్పిదమేనని స్పష్టంగా తెలుస్తోంది. కనీస రక్షణ చర్యలు చేపట్టుకుండా పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఇతర కమిటీల విచారణతో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు. గ్యాస్ ప్రభావానికి గురైన వారు తమ జీవితకాలం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వారందరికీ ప్రత్యేక ఆరోగ్య కార్డులు మంజూరు చేసి జీవిత కాలం వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. 

 

Updated Date - 2020-05-09T18:49:58+05:30 IST