22 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కాణిపాకం బ్రహ్మోత్సవాలు: కలెక్టర్

ABN , First Publish Date - 2020-08-08T23:56:49+05:30 IST

కాణిపాకం బ్రహ్మోత్సవాలపై అధికారులతో కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కాణిపాకం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు

22 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కాణిపాకం బ్రహ్మోత్సవాలు: కలెక్టర్

చిత్తూరు: కాణిపాకం బ్రహ్మోత్సవాలపై అధికారులతో కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కాణిపాకం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కరోన నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిరోజు స్వామివారికి పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించాలని సూచించారు. వినాయక చవితి రోజు నాలుగు వేల మందికి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన వారికి ఆలయ ప్రవేశం లేదని కలెక్టర్ తెలిపారు.

Updated Date - 2020-08-08T23:56:49+05:30 IST