శ్రీమహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ
ABN , First Publish Date - 2020-10-24T08:25:30+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం బెజవాడ కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం బెజవాడ కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కమలాలను ధరించి వరద అభయ హస్తాలతో అనుగ్రహమిచ్చిన అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
సాయంత్రం శ్రీగంగా పార్వతీ (దుర్గ) సమేత మల్లేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తులకు వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు.
- విజయవాడ