కేసులు పెట్టి వేధిస్తే చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం: కాల్వ శ్రీనివాసులు

ABN , First Publish Date - 2020-11-07T20:11:45+05:30 IST

అనంతపురం: టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడుగా కాల్వ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

కేసులు పెట్టి వేధిస్తే చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం: కాల్వ శ్రీనివాసులు

అనంతపురం: టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడుగా కాల్వ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజల ఆశీస్సులతో మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు కార్యకర్తలను ప్రతి చోటా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాటం చేస్తున్నారన్నారు. నిజాయితీగా ఉన్న నాయకులపై కేసులు పెట్టి వేధిస్తే చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. 


Updated Date - 2020-11-07T20:11:45+05:30 IST