-
-
Home » Andhra Pradesh » kalavenkatrao
-
పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ నిర్ణయాలు: కళా వెంకట్రావు
ABN , First Publish Date - 2020-12-06T23:28:47+05:30 IST
కేంద్రం ఇచ్చే రూ.4వేల కోట్లు అప్పు కోసమే వైసీపీ ప్రభుత్వం విద్యుత్ మీటర్ల పేరుతో..

అమరావతి: పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ నిర్ణయాలు ఉన్నాయని మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. కేంద్రం ఇచ్చే రూ.4వేల కోట్ల అప్పు కోసమే.. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని విమర్షించారు. పన్నులు పెంచి ఆదాయం సృష్టించాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆక్షేపించారు.