-
-
Home » Andhra Pradesh » Kalava Srinivasulu tdp ycp cm jagan l
-
ఆధారాలిస్తాం.. వాళ్లను జైలుకు పంపే దమ్ముందా?: కాల్వ
ABN , First Publish Date - 2020-04-07T22:28:23+05:30 IST
వైసీపీ నేతలపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.

అనంతపురం: వైసీపీ నేతలపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సాయాన్ని వైసీపీ అభ్యర్థులతో పంపిణీ చేయించడం అభ్యంతరకరమన్నారు. లబ్దిదారులకు నగదు పంచుతూ వైసీపీకి ఓటేయమనడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎవడబ్బసొమ్మని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నానని, సీఎం జగన్ జేబు నుంచి కానీ వైసీపీ నుంచి కానీ వచ్చిందా? అని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. డబ్బు, మద్యం పంచితే జైలుకు పంపుతామంటూ ఆర్డినెన్స్ తెచ్చారని.. ఆధారాలిస్తాం..మీ పార్టీ అభ్యర్థులను జైలుకు పంపే దమ్ముందా? అని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు.