తక్షణమే దుర్గగుడి పాలకమండలిని రద్దు చేయాలి: కళా వెంకట్రావు
ABN , First Publish Date - 2020-10-01T20:12:56+05:30 IST
విజయవాడ కనకదుర్గగుడి సభ్యురాలు వరలక్ష్మి కారులో మద్యం లభించడం..
అమరావతి: విజయవాడ కనకదుర్గగుడి సభ్యురాలు వరలక్ష్మి కారులో మద్యం లభించడం..జగన్ దోపిడీ విధానాలకు పరాకాష్ట అని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. పవిత్రంగా ఉండాల్సిన దేవాలయాల పాలకమండళ్ల సభ్యులు..ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే దుర్గగుడి పాలకమండలిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి కనుసన్నల్లోనే పాలకమండలి సభ్యులు పనిచేస్తున్నారని, దీనికి మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. హిందూ దేవుళ్ల పట్ల విశ్వాసం లేనివారికి పదవులు కట్టబెట్టి.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని కళా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.