హిందూ సంప్రదాయాలను వైసీపీ మంటగలుపుతోంది: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2020-09-20T15:55:32+05:30 IST

హిందూ సంప్రదాయాలను వైసీపీ మంటగలుపుతోందని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు.

హిందూ సంప్రదాయాలను వైసీపీ మంటగలుపుతోంది: కళా వెంకట్రావు

అమరావతి: హిందూ సంప్రదాయాలను వైసీపీ మంటగలుపుతోందని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆలయాలపై దాడులు, విగ్రహాల మాయంపై ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. కలియుగ దైవం శ్రీవారిని కూడా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీటీడీకి ఎవరూ డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు లేవంటూ... వైవీ సుబ్బారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కళా వెంకట్రావు విమర్శించారు. హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ బాండ్లలో టీటీడీ నిధులు పెట్టుబడి పెట్టడం మంచిది కాదన్నారు. దేవుడి సొమ్మును ప్రభుత్వ బాండ్లలో ఎలా పెడతారని కళా వెంకట్రావు ప్రశ్నించారు.

Updated Date - 2020-09-20T15:55:32+05:30 IST