రిగ్గింగ్‌ చేసైనా ఎన్నికల్లో గెలవాలని వైసీపీ భావిస్తోంది: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2020-03-18T22:00:26+05:30 IST

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎస్‌ఈసీకి కులాన్ని ఎలా అంటగడుతారని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు.

రిగ్గింగ్‌ చేసైనా ఎన్నికల్లో గెలవాలని వైసీపీ భావిస్తోంది: కళా వెంకట్రావు

గుంటూరు: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎస్‌ఈసీకి కులాన్ని ఎలా అంటగడుతారని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. ఎస్‌ఈసీపై కుల ముద్ర వేయడాన్ని ఖండిస్తున్నామని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలపైనే దృష్టి ఉందని, రిగ్గింగ్‌ చేసైనా ఎన్నికల్లో గెలవాలని వైసీపీ భావిస్తోందని కళా వెంకట్రావు విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కరోనాపై ప్రపంచమంతా అప్రమత్తంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని కళా వెంకట్రావు మండిపడ్డారు.

Updated Date - 2020-03-18T22:00:26+05:30 IST