వైసీపీలో చేరిన బాలయ్య సన్నిహితుడు.. ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-03-10T22:48:43+05:30 IST

టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన

వైసీపీలో చేరిన బాలయ్య సన్నిహితుడు.. ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి : టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కదిరి బాబూరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ టీడీపీకి టాటా చెప్పేసిన ఆయన.. ఏపీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


బాలయ్యను చూసే ఇన్ని రోజులూ..

పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నాను. కనిగిరిలో గెలిచినా నన్ను మరో నియోజకవర్గానికి మార్చారు. టికెట్‌ అడిగితే కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఓడినా కనిగిరి ఇంఛార్జ్‌ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు. వైసీపీలో చేరడానికి అనేక కారణాలు ఉన్నాయి. గతంలో నాకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినా.. బాలకృష్ణను చూసే పార్టీలో ఉన్నాను అని బాబూరావు చెప్పుకొచ్చారు.


బాలయ్య మంచోడే కానీ..

అంతటితో ఆగని ఆయన బాలయ్య గురించి కూడా మాట్లాడారు.బాలకృష్ణ చాలా మంచోడు.. ఆయన మాటకూడా అధిష్టానం లెక్కచేయలేదు. నందమూరి, నారా కుటుంబాలకు వ్యత్యాసం ఉంది. జగన్‌పై నమ్మకంతోనే వైసీపీలో చేరానుకదిరి బాబూరావు మీడియా ముందు వెల్లడించారు.

Updated Date - 2020-03-10T22:48:43+05:30 IST