కడపలో విస్తారంగా వర్షాలు
ABN , First Publish Date - 2020-09-14T13:17:34+05:30 IST
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
కడప: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పెన్నానది పరవళ్ళు తొక్కుతోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరు వంతెనలపై ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు వర్షపు నీటితో పెన్నా ప్రవాహంతో పాటు పలు చోట్ల పంటలు నీటమునిగాయి.