అమ్మను అడవిలో వదిలేశారు!
ABN , First Publish Date - 2020-11-13T09:55:14+05:30 IST
నవ మాసాలు మోసి పిల్లలను కని, కష్టనష్టాలకోర్చి వారిని ప్రయోజకులను చేసిన ఓ తల్లికి వృద్ధాప్యంలో పెద్ద కష్టమే వచ్చింది. ముసలి తల్లి
కడప (క్రైం): నవ మాసాలు మోసి పిల్లలను కని, కష్టనష్టాలకోర్చి వారిని ప్రయోజకులను చేసిన ఓ తల్లికి వృద్ధాప్యంలో పెద్ద కష్టమే వచ్చింది. ముసలి తల్లి భారమనుకున్న బిడ్డలు ఆమెను అడవిలో వదిలేశారు. కడప నగర శివార్లలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు సమీపంలోని అడవిలోంచి గురువారం ఉదయం ఆర్తనాదాలు వినిపిస్తుండడంతో అటుగా వెళుతున్న వారు వెళ్లి పరిశీలించారు. రాళ్లు, ముళ్లపొదల మధ్యలో ఓ వృద్ధురాలు కనిపించింది. వారు వెంటనే స్పందించి 108 వాహనంలో వృద్ధురాలిని చికిత్స కోసం రిమ్స్ తరలించారు. ఆ అభాగ్యురాలిది సీకేదిన్నె మండలం అప్పరాజుపల్లి. తనకు కొడుకు, కూతుళ్లు ఉన్నారని.. వారే తనను అడవిలో వదిలేసి వెళ్లిపోయారంటూ భోరున విలపించింది.