కడప: నరసాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-08-20T13:32:51+05:30 IST

జిల్లాలోని కాశీనాయన మండలం నరసాపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

కడప: నరసాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

కడప: జిల్లాలోని కాశీనాయన మండలం నరసాపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామవాలంటీరు భర్త,  వైసీపీ శ్రేణుల దాడి వల్ల గుర్రప్ప అనే యువకుడు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన దాడిలో గుర్రప్ప తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అవమానంతో గుర్రప్ప కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గుర్రప్ప మృతి చెందాడు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో  పోలీసు బలగాలు మోహరించారు. 

Read more